Breaking News

సీరియల్ చూస్తుండగా బాంబులా పేలిన టీవీ.. మహిళ మృతి


సీరియల్ చూస్తున్న సమయంలో హఠాత్తుగా టీవీ పేలడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆమె భర్త, ఆరు నెలల వయసున్న పాప తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. Also Read: సుందర్‌గఢ్‌ జిల్లా దురువ ఠాణా లహండబుడ గ్రామానికి చెందిన ఢిల్లేశ్వర నాయక్‌, బాబినాయక్‌(30) భార్యభర్తలు. వీరికి ఆరు నెలల క్రితం ఓ పాప పుట్టింది. శుక్రవారం రాత్రి దంపతులు పాపను ఒళ్లో పడుకోబెట్టుకుని టీవీలో సీరియల్ చూస్తున్నారు. ఆ సమయంలో భారీ శబ్ధం చేసుకుంటూ టీవీ పేలిపోయింది. ఈ ఘటనతో స్థానికులు బాంబు పేలిందేమో అనుకుని భయభ్రాంతులకు గురయ్యారు. Also Read: ఢిల్లేశ్వర నాయక్ ఇంట్లో నుంచి దట్టమైన పొగ రావడంతో లోనికి వెళ్లి చూడగా దంపతులిద్దరూ అపస్మారక స్థితిలో పడివున్నారు. దీంతో ఆ ముగ్గురిని అంబులెన్స్‌లో సుందరగఢ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాబినాయక్‌ ఆస్పత్రిలో చనిపోయింది. తీవ్రంగా గాయపడిన ఢిల్లేశ్వర, పాపకు డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. షార్ట్‌సర్క్యూట్‌ వల్లే టీవీ పేలినట్లు పోలీసులు భావిస్తున్నారు. Also Read:


By February 23, 2020 at 12:30PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/odisha-woman-died-over-tv-blast-while-watching-serials/articleshow/74264490.cms

No comments