Breaking News

ఆప్ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై కాల్పులు.. ఒకరి దుర్మరణం


ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నరేష్ యాదవ్ కాన్వాయ్‌పై ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలో ఆప్ కార్యకర్త ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సౌత్ వెస్ట్ ఢిల్లీలోని కిషన్‌ఘర్‌ గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందిన నరేష్ యాదవ్.. తన అనుచరులతో కలిసి గుడికి వెళ్లి తిరిగొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మెహ్రౌలి ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఏడు రౌండ్ల కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన ఓ వ్యక్తి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ తెలిపింది. అశోక్ మన్ అనే పార్టీ కార్యకర్త కాల్పుల్లో చనిపోయాడని ఆప్ నేత సంజయ్ సింగ్ ట్వీట్ చేశారు. ఇవాళ జరిగిన కాల్పుల్లో మేం ఓ కుటుంబ సభ్యుడిని కోల్పోయాం. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీట్ చేసింది. ‘‘మా ఎమ్మెల్యే నరేష్ యాదవ్, అతడి అనుచరులపై అనేకసార్లు కాల్పులు జరిపారు. దుండగులు మరో కార్లో కూర్చొని ఈ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడ్డారు’’ అని ఆప్ సోషల్ మీడియా ఇంఛార్జ్ అంకిత్ లాల్ ట్వీట్ చేశారు.


By February 12, 2020 at 07:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/shots-fired-at-the-convoy-of-mehrauli-aap-mla-one-killed/articleshow/74091412.cms

No comments