Breaking News

నిశ్చితార్ధ వేడుకల్లో దారుణం.. పదేళ్ల బాలికను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి..


బంధువుల నిశ్చితార్ధ వేడుకలకు వెళ్లిన పదేళ్ల బాలికపై దారుణగానికి ఒడిగట్టిందో మానవ మృగం. వేడుకల్లో క్యాటరింగ్ పనుల కోసం వచ్చిన ఓ వ్యక్తి బాలికను తీసుకెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాత్రూమ్‌లో అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చూసిన నిర్ఘాంతపోయిన తల్లిదండ్రులు నిందితుడిని పోలీసులకు అప్పగించారు. పదేళ్ల బాలికపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన అమానుష ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జైపూర్‌కు చెందిన దంపతులు తమ పదేళ్ల కుమార్తెతో కలసి బంధువుల నిశ్చితార్థ వేడుకలకు వెళ్లారు. కొద్దిసేపటి తర్వాత బాలిక కనిపించకపోవడంతో అంతా వెతికారు. బాత్రూమ్‌ గడియవేసి ఉండడంతో అనుమానం వచ్చి తెరిచి చూసి షాక్‌కు గురయ్యారు. Also Read: అత్యాచారానికి గురై అపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను చూసి తల్లిదండ్రులు, బంధువులు నిర్ఘాంతపోయారు. అక్కడ ఉన్న వారినందరినీ ప్రశ్నించగా భోజనాలు వడ్డించేందుకు క్యాటరింగ్‌ బృందంతో వచ్చిన రాజు కంగారుపడ్డాడు. గట్టిగా నిలదీయడంతో బాలికను తానే బలవంతంగా బాత్రూమ్‌లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. Read Also: పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. నిందితుడు రాజుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైన బాలిక షాక్‌తో అపస్మారక స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.


By February 04, 2020 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/10-years-old-girl-allegedly-raped-in-rajasthan/articleshow/73927930.cms

No comments