హైదరాబాద్‌లో రోడ్డుప్రమాదం.. తూ.గో. జిల్లా యువకుడి దుర్మరణం
అతివేగం ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రాణం బలిగొంది. మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో టెక్కీ దుర్మరణం పాలయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో ఉన్న దుద్దికూర్ గ్రామానికి చెందిన విజయ్‌కుమార్(25) జూబ్లీహిల్స్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూకట్‌పల్లిలోని వివేకానందనగర్‌కాలనీలో ఉంటున్నాడు. Also Read: రోజూ ఉదయం మియాపూర్ బొల్లారం రోడ్డులోని జిమ్‌కు వెళ్లి వచ్చేవాడు. గురువారం కూడా జిమ్‌కు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ క్రమంలోనే విద్యుత్ స్తంభానికి తల తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకుని మదీనాగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు అతడికి చికిత్స అందించినప్పటికీ తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు అతడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. Also Read:
By February 14, 2020 at 10:14AM
No comments