Breaking News

పిల్లలు పుట్టలేదని విడాకులు కోరిన భర్త.. కడప మహిళ తీవ్ర నిర్ణయం


అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జిల్లా ఓబులవారిపల్లె మండలం కాకర్లవారిపల్లెలో శనివారం జరిగింది. మండలంలోని చిన్నఓరంపాడుకు చెందిన నాగమణికి(32) కాకర్లవారిపల్లెలో గ్రామంలో కస్తూరి రాజాతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్యాభర్తలిద్దరు జీవనోపాధి కోసం కువైట్‌కు వెళ్లారు. సుమారు మూడు నెలల క్రితం నాగమణి కువైట్‌ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. వివాహమై పదేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో అత్తారింటి నుంచి వేధింపులు అధికమయ్యాయి. Also Read: ఈ నేపథ్యంలో రాజాకు మరో పెళ్లి చేసేందుకు అత్తమామలు ప్రయత్నిస్తున్నారు. దీంతో విడాకులు ఇవ్వాలంటూ నాగమణిని వేధిస్తున్నారు. పిల్లల విషయంతో దంపతుల మధ్య అనేకసార్లు గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లాయి. దీంతో నాగమణి తీవ్ర మనస్తాపానికి గురైంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తన బాధలు ఎవరికీ చెప్పుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇన్ని గొడవల మధ్య బ్రతికుండటం కంటే చనిపోవడమే మేలనుకుని శనివారం ఇంట్లోనే శరీరంపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా కాలిపోయిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బంధువులు వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By February 02, 2020 at 11:24AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kadapa-woman-commits-suicide-over-in-laws-harassment/articleshow/73864591.cms

No comments