Breaking News

భార్య నలుగురితో అఫైర్ పెట్టుకుందని.. అక్కడ సీల్ వేసిన భర్త


వివాహ బంధం నమ్మకం అనే పునాది బలంగా ఉంటేనే సవ్యంగా సాగుతుంది. అలాకాకుంగా జీవిత భాగస్వామిపై అనుమానం పెంచుకుంటే మాత్రం సంసారమే నావ కుదుపులకు లోనై మునిగిపోయే ప్రమాదముంది. ఇదే విధంగా అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి తాను వ్యాపార పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో భార్య జననాంగాలకు సీల్ వేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఇప్పుడా భర్త కటకటాలు లెక్కపెడుతున్నాడు. Also Read: కెన్యాకు చెందిన డెన్నిస్ ముమో అనే వ్యక్తి వ్యాపారం చేస్తుంటాడు. భార్యను తనను మోసం చేస్తూ నలుగురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుందని కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. దీంతో తాను ఇంట్లో లేని సమయంలో ఆమె జననాంగాల(యోని) వద్ద సీల్ వేసేందుకు వాడే జిగురు లాంటి పదార్థాన్ని రాసి తాళం వేసి వెళ్లేవాడు. తాను ఎలాంటి తప్పు చేయడం లేదని ఆమె మొత్తుకున్న డెన్నిస్ పైశాచికంగా వ్యవహరించేవాడు. Also Read: ఇటీవల వ్యాపార పనుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లే సమయంలో డెన్నిస్ భార్య యోని వద్ద ఆ పదార్థాన్ని రాశాడు. కాసేపటికే ఆమెకు అక్కడ మంటగా అనిపించడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లింది. ఆమె పరిస్థితి చూసి షాకైన డాక్టర్లు ట్రీట్‌మెంట్ ఇచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హాస్పిటల్‌కు చేరుకున్న పోలీసులు ఆమె నుంచి వివరాలు కనుక్కుని భర్తపై గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. Also Read: ఈ సందర్భంగా పోలీసుల వద్ద భర్త హడావుడి చేశాడు. తన భార్య నలుగురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుని తనను మోసం చేస్తోందని, వారికి తన నగ్నచిత్రాలు పంపిస్తూ సెక్స్ చాట్ కూడా చేస్తోందని చెప్పాడు. ఇటీవల ఆమె సెల్‌ఫోన్ అవన్నీ చూసి షాకయ్యానని, అందుకే ఆమె పట్ల అలా వ్యవహరిస్తున్నానని చెప్పాడు. తన వివాహ బంధాన్ని కాపాడాలని పోలీసులను వేడుకున్నాడు. అయితే అతడు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించకలేకపోవడంతో పోలీసులు భర్తను కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. Also Read:


By February 16, 2020 at 01:46PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kenya-man-attempts-to-seal-womans-genitals-with-superglue-after-suspecting-she-was-having-affairs-with-4-men/articleshow/74158966.cms

No comments