Breaking News

ప్రియురాలికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య


తాను ప్రేమించిన యువతికి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలోని ఓ గ్రామంలో బుధవారం జరిగింది. జనవరి 26న పురుగుల మందు తాగిన యువకుడు పరిస్థితి విషమించడంతో బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. ఆ గ్రామానికి చెందిన యువకుడు (17) మండల కేంద్రంలోని ఓ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఇంటర్ సెకండియర్ చదువుతున్న యువతిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. Also Read: వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడికి చెప్పి పారిపోయి పెళ్లి చేసుకుందామని చెప్పింది. తన ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పే ధైర్యం లేక, యువతిని బయటకు తీసుకెళ్తే ఎలా పోషించాలి అని ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన ప్రియురాలిని వేరే అబ్బాయితో పెళ్లి జరిగితే ఎలా బ్రతకాలి అన్న ఆందోళనతో జనవరి 26న ఇంట్లో పురుగుల మందు తాగాడు. Also Read: ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఎన్నిరోజులు చికిత్స అందించినా శరీరం సహకరించకపోవడంతో అతడు బ్రతకడం కష్టమని తేల్చేశారు. దీంతో కుటుంబసభ్యులు బుధవారం అతడిని ఇంటికి తీసుకొస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By February 21, 2020 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/inter-student-commits-suicide-over-love-failure-in-telangana/articleshow/74235785.cms

No comments