భార్యతో గొడవపడి ఇంటి యజమాని హత్య.. ఒక్క గుద్దుతో కుప్పకూలిపోయాడు

దంపతుల మధ్య వివాదం ఇంటి యజమాని హత్యకు దారి తీసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. భార్యతో గొడవపడుతున్న కిరాయి దారుడు ఇంటి యజమాని టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకుని చూస్తున్నాడన్న కోపంతో అతడిని చంపేశాడు. ఆర్మూర్‌లో బుధవారం రాత్రి జరిగిన ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి. Also Read: గోల్‌బంగ్లా ప్రాంతంలో గిర్మాజీ రాజేందర్ (40) అనే వ్యక్తికి సొంత ఇల్లు ఉంది. ఓ పోర్షన్ ఖాళీ ఉండటంతో బాలనర్సయ్య అనే వ్యక్తి అద్దెకి ఇచ్చాడు. బుధవారం రాత్రి బాలనర్సయ్య భార్యతో గొడవపడుతున్న సమయంలో రాజేందర్ భార్య, కొడుకుతో కలిసి టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకుని చూస్తున్నాడు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన బాలనర్సయ్య రాజేందర్‌తో గొడవకు దిగాడు. ఆయన తలపై చేత్తో కొట్టడంతో రాజేంద్రర్ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీఐ రాఘవేందర్, ఎస్సై యాదగిరిగౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు బాలనర్సయ్యపై కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీ కావడంతో అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:
By February 21, 2020 at 10:42AM
No comments