Breaking News

కండోమ్స్ కావాలంటూ ఫోన్‌కాల్స్.. హైదరాబాద్ యువతికి ఊహించని అనుభవం


హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి కొద్దిరోజుల క్రితం ఓ ఫోన్‌కాల్ వచ్చింది. అవతలి నుంచి మాట్లాడిన ఓ వ్యక్తి తనకు ఫలానా కంపెనీకి చెందిన కండోమ్స్ ప్యాకెట్ కావాలని అడిగాడు. రాంగ్ కాల్ అనుకున్న ఆమె దాన్ని లైట్ తీసుకుంది. రెండ్రోజుల తర్వాత మరో వ్యక్తి ఫోన్ చేసి తన గర్ల్‌ఫ్రెండ్‌కి లోదుస్తులు కావాలని అసభ్యంగా మాట్లాడాడు. అప్పటినుంచి ఆమెకు రోజుకు పదుల సంఖ్యలో ఫోన్‌కాల్స్ రావడం మొదలయ్యాయి. ఫలానా వెబ్‌సైట్లో వస్తువులు ఆర్డర్ చేశామంటూ కాల్స్, మెసేజ్‌లు రావడంతో ఆమె షాకైంది. Also Read: అసలేం జరుగుతుందో తెలుసుకునేందుకు స్నేహితుల సాయంతో రంగంలోకి దిగగా దిమ్మతిరిగే విషయం వెలుగులోకి వచ్చింది. ఎవరో తన ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడీ వినియోగించి ఫేక్ వెబ్‌సైట్ క్రియేట్ చేసినట్లు తెలుసుకుంది. అందులో మహిళల లోదుస్తులు, కండోమ్ ప్యాకెట్లు, సెక్స్ టాయ్స్ అమ్ముతున్నట్లు గుర్తించింది. ఆ వస్తువులను డోర్ డెలివరీ చేస్తామని ప్రకటన ఉండటంతో చాలామంది ఆసక్తి చూపి ఆర్డర్లు చేశారు. అందులో ఆర్డర్ ఇవ్వగానే బాధితురాలి మొబైల్‌కి మెసేజ్‌లు వస్తున్నాయి. Also Read: ముందుగా డబ్బులు చెల్లించిన వారు ఆర్డర్ రాకపోతే ఆమె మొబైల్‌కి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడుతున్నారు. దీంతో కుంగిపోయిన బాధితురాలు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. యువతికి బాగా పరిచయమున్న వ్యక్తే ఈ నీచానికి పాల్పడుతున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. Also Read:


By February 20, 2020 at 11:08AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rachakonda-cyber-crime-booked-case-unidenfied-man-over-harassment-on-woman/articleshow/74220236.cms

No comments