ఛీ.. ఈమె అసలు ఆడదేనా?... 16ఏళ్ల బాలికను భర్తతో రేప్ చేయించింది
ఆడదానికి ఆడదే శత్రువని నిరూపించిందో ఓ మహిళ. కూతురు వయసున్న బాలికను మాయమాటలతో నమ్మించి ఇంటికి తీసుకొచ్చిన ఆ దర్మార్గురాలు భర్తతో అత్యాచారం చేయించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లా పశ్చిమ సరీరా పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే... కౌశాంబి జిల్లా పశ్చిమ సరీరాకు చెందిన ఓ మహిళ స్థానికంగా దళిత బాలిక(16)తో పరిచయం పెంచుకుంది. ఆమెకు మాయమాటలు చెప్పి కొద్దిరోజుల క్రితం తన ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె భర్త బాలికను గదిలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు పెడుతున్నా ఆ మహిళ మనసు కరగలేదు. ఆమె కళ్లెదుటే భర్త బాలికను చెరబట్టాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని నిందితులు బాలికను బెదిరించారు. దీంతో భయపడిన బాలిక తనపై జరిగిన అత్యాచారం విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే కూతురు విచారంగా ఉండడాన్ని గమనించిన తల్లి ఏం జరిగిందని నిలదీయగా అసలు విషయం చెప్పి బోరుమంది. దీంతో బాలిక తల్లి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు ముందుగా కేసు నమోదు చేయడానికి నిరాకరించారు. దీంతో బాధితురాలి తల్లి నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
By August 16, 2021 at 10:54PM
No comments