Breaking News

బ్యాంక్ మేనేజర్ క్రిమినల్ మైండ్.. మందుల్లో సెనైడ్ కలిపి భార్య హత్య


జిల్లా మదనపల్లిలో దారుణం వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను ఎవరికీ అనుమానం రాకుండా భర్త హత్య చేశాడు. ఆమె వేసుకునే మందుల్లో సెనైడ్ కలిపి ప్రాణాలు తీశాడు. ముందుగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులకు విచారణలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. Also Read: మదనపల్లికి చెందిన రవి చైతన్య బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఆయని జనవరి 27న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా రవిచైతన్య పాత్రపై షాకయ్యే నిజాలు తెలుసుకున్నారు. ఆయని వేసుకునే టాబ్లెట్లతో సెనైడ్ కలిపి అతడే భార్యను అతి కిరాతకంగా హత్య చేసినట్లు తేల్చారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందన్న కోపంతోనే ఆమె చంపేసినట్లు చెప్పాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By February 03, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bank-manager-arrested-in-chittor-over-wife-murder-case/articleshow/73891812.cms

No comments