పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడి.. హోంగార్డుపై కేసు నమోదు

పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా దోచుకున్న హోంగార్డుపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి 2013లో వివాహమైంది. మనస్పర్థల కారణంగా 2014లో ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత గౌలిపురా సుల్తాన్‌షాహికి చెందిన రాహుల్ అనే హోంగార్డు ఆమెకు పరిచయం అయ్యాడు. Also Read: యువతి వివరాలన్నీ తెలుసుకున్న రాహుల్ తాను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెను వెంట తిప్పుకుని తన గదికి తీసుకెళ్లి అనేకసార్లు లైంగిక కోరికలు తీర్చుకున్నాడు. కొద్దిరోజులుగా యువతి కంట పడకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో ఆమె ఆరా తీయగా మరో యువతితో నిశ్చితార్థానికి సిద్ధమైనట్లు తెలిసింది. మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు హోంగార్డుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By February 21, 2020 at 11:51AM
No comments