జీలకర్ర పెట్టే సమయానికి ట్విస్ట్ ఇచ్చిన వధువు.. షాక్‌లో వరుడు

తాళికట్టే సమయానికి వధువు ఇచ్చిన ట్విస్ట్‌లో ఏకంగా పెళ్లి ఆగిపోయిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. కొత్తకోట మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే యువకుడికి అదే మండలం పామాపురం గ్రామానికి చెందిన నందిని అనే యువతితో వివాహం నిశ్చయించారు. శుక్రవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. బంధుమిత్రలుతో పెళ్లి వేడుక కళకళలాడుతోంది. Also Read: వధూవరులు నెత్తిపై జీలకర్ర పెట్టే సమయంలో నందిని అందరికీ షాకిస్తూ తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో పెళ్లికి వచ్చినవారంతా షాకయ్యారు. తన మేనబావను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నందిని పెళ్లి నిరాకరించిందని తెలిసి అందరూ అతడిని చితకబాదారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. Also Read: ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను సముదాయించారు. వధువు తన మేనబావను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోనని చెప్పడంతో వరుడు తరపువారు మండపం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిదండ్రులతో మాట్లాడిన పోలీసులు నందినికి ఇష్టం లేని పెళ్లి చేయొద్దని సూచించారు. Also Read:
By February 29, 2020 at 10:28AM
No comments