Breaking News

వికారాబాద్‌లో అక్కా, తమ్ముడి ప్రేమాయణం.. పెద్దలు అంగీకరించరన్న భయంతో


వారిద్దరూ వరుసకు అక్కాతమ్ముడు అవుతారు. కానీ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. విషయం తెలుసుకున్న పెద్దలు మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. దీంతో మనస్తాపం చెందిన ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని చేసుకున్నారు. ఈ ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. Also Read: కులకచర్ల మండలం కామునిపల్లిలో గ్రామానికి చెందిన మమత(20) డిగ్రీ చదువుతోంది. అదే గ్రామానికి చెందిన ప్రశాంత్‌(19) ఆమెకు వరుసకు తమ్ముడు అవుతాడు. పదో తరగతి వరకు చదివి అతడు సెంట్రింగ్ పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చేసిన ప్రశాంత్‌తో మమతతో మాత్రం ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పెద్దలు ఇది మంచి పద్ధతి కాదని, దూరంగా ఉండాలని హెచ్చరించారు. Also Read: దీంతో తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతో చనిపోవాలని వారిద్దరు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రశాంత్ హైదరాబాద్ నుంచి గ్రామానికి చేరుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున ప్రశాంత్ ఇంట్లోనే ఇద్దరూ ఒకే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రశాంత్ తండ్రి గోపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. Also Read:


By February 06, 2020 at 11:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/lover-commits-suicide-in-vikarabad-district/articleshow/73976790.cms

No comments