అద్దె ఇంట్లో బంగ్లా యువతులతో వ్యభిచారం.. హైదరాాబాద్‌లో భార్యభర్తల అరెస్ట్
అద్దె ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న భార్యాభర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివారు ఘట్‌కేసర్ మండలం చౌదరిగూడ గ్రామంలోని సాయినగర్ కాలనీలో సురేందర్‌మూర్తి, రాజేశ్వరి దంపతులు కొద్ది రోజులుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్‌కు బుధవారం సమాచారం అందింది. దీంతో మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆదేశం మేరకు ఘట్‌కేసర్ పీఎస్‌కు చెందిన ఓ కానిస్టేబుల్ విటుడిగా పరిచయం చేసుకొని వారి ఇంట్లోకి ప్రవేశించాడు. Also Read: లోపల వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌కు చెందిన ముగ్గురు యువతులకు విముక్తి కల్పించి దంపతులను అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌కు చెందిన అభిజీత్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహేశ్ అండతో భార్యభర్తలు ఈ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు. అభిజీత్ పాస్‌పోర్టు, వీసా లేకుండా అక్రమంగా వలస వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో భాగంగా ఓ సెల్‌ఫోన్, రూ.5100 నగదును స్వాధీనం చేసుకున్నారు. Also Read:
By February 14, 2020 at 12:24PM
No comments