వరంగల్‌లో బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు యువకులు దుర్మరణం
వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్‌పై ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గీసుకొండ మండలం గంగదేవిపల్లి గ్రామానికి చెందిన ఇట్ల జగదీశ్(19), న్యాల నవీన్(20), జనగామ జిల్లా నర్మెట్ట మండలం మాన్‌సింగ్ తండాకు చెందిన లకావత్ గణేష్(21) ముగ్గురు గురువారం రాత్రి బైక్‌పై గంగదేవిపల్లికి వెళ్తున్నారు. Also Read: కాసేపట్లో గంగదేవిపల్లికి చేరుకుంటారనగా వీరి బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో గంగదేవిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. జగదీశ్, నవీన్ కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. చేతికి అందివచ్చిన కొడుకులు విగతజీవులుగా మారడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
By February 14, 2020 at 12:39PM
No comments