Breaking News

దారుణం.. కరోనా అనుమానితుడ్ని కాల్చిచంపిన ఉత్తర కొరియా!


తమ దేశంలో కేసులు లేవని ప్రకటించిన ఉత్తర కొరియా.. కోవిడ్ సోకిన వ్యక్తిని కాల్చిచంపినట్టు తెలుస్తోంది. అధికారి.. ఇటీవల చైనాలో పర్యటించారు. ఇదే సమయంలో కరోనా వైరస్ బయటపడగా.. ఆయన స్వదేశానికి తిరిగొచ్చారు. చైనా నుంచి వచ్చిన అతడిని నిర్బంధంలోకి తీసుకుని కరోనా పరీక్షలు నిర్వహించిన అధికారులు.. తర్వాత ఆయనను కాల్చి చంపినట్టు ఉత్తర కొరియా వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇటీవల చైనా వెళ్లొచ్చిన జాతీయ భద్రత ఏజెన్సీలో పనిచేస్తోన్న మరో అధికారిని విధుల నుంచి తప్పించారు. చైనాతో సరిహద్దులు పంచుకునే ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కేసులు నమోదుకాలేదని ఆ ప్రభుత్వం తెలిపింది. కానీ, ఈ ప్రకటనపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొరుగు దేశంలో వేలాది మంది బాధితులు ఉంటే, ఒక్కరంటే ఒక్కరూ లేరని చెబుతోంది. కరోనా కేసులు లేవని అధికారులు చేస్తున్న ప్రకటనలు పలు అనుమానాలకు తావిస్తోందని ఐరాస ఆహార, వ్యవసాయ విభాగానికి చెందిన ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా, రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో కొంత మంది నిర్బంధించినట్టు అక్కడ మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. తమ పౌరులకు కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఉందని భావిస్తోన్న ఉత్తర కొరియా అధికారులు కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా విదేశీ పర్యాటకులను దేశంలోని రాకుండా నిషేధించారు. అంతేకాదు, ఇటీవల చైనా నుంచి వచ్చిన విదేశీయులను నిర్బంధంలోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నియమాలు అమలుచేసే దేశాల్లో ఉత్తర కొరియా ఒకటి. కరోనా వైరస్ ముప్పు పొంచి ఉండటంతో ఒకవేళ ఎవరైనా చనిపోతే తప్పనిసరిగా వారిని దహనం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


By February 14, 2020 at 01:18PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/north-korean-who-suspected-of-having-coronavirus-shot-dead-after-leaving-quarantine/articleshow/74131421.cms

No comments