Breaking News

Baat Bihar Ki: నితీశ్ టార్గెట్‌గా ప్రశాంత్ కిశోర్.. బిహార్ ఎన్నికలే లక్ష్యంగా..!


ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న .. తాజాగా బిహార్‌ సీఎం నితీశ్ కుమార్‌ను టార్గెట్ చేసుకున్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఎన్నికల వ్యూహకర్త పీకే.. ‘‘బాత్ బిహార్ కీ’’ అనే కొత్త క్యాంపెయిన్‌ను ప్రకటించారు. ఫ్రిబవరి 20 నుంచి వంద రోజులపాటు తాను బిహార్ అంతటా పర్యటిస్తానని.. నితీశ్ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ ఆయన గళం వినిపించనున్నారు. నేను ఎక్కడికీ వెళ్లను.. బిహార్‌ కోసమే పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. బిహార్‌‌లో కొత్త నాయకత్వం అవసరం అనుకునేవారిని కలుపుకొని పోతామని.. అభివృద్ధిని కోరకునే వారు తనతో కలిసి రావొచ్చని.. బిహార్‌ను దేశంలో టాప్-10 రాష్ట్రాల్లో ఒకటిగా నిలుపుతామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. వంద రోజుల్లో కోటి మంది యువతను ఏకతాటి మీదకు తీసుకొచ్చే ఉద్దేశంతో ‘బాత్ బిహార్ కీ’ని ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. జేడీయూ ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిశోర్‌ను ఆ పార్టీ చీఫ్, బిహార్ సీఎం ఈ మధ్యే పార్టీ నుంచి బహిష్కరించారు. పౌరసత్వ సవరణ చట్టం విషయంలో పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పదే పదే మాట్లాడుతుండటంతో.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నితీశ్ తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ.. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయని, ఆయనంటే అమితమైన గౌరవం ఉందని పీకే తెలిపారు. బిహార్లో మనుగడ సాగించడానికి బీజేపీతో కలిసి సాగాలని నితీశ్ భావిస్తున్నారు. కానీ నేను దాంతో అంగీకరించనని పీకే తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్లో బిహార్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. పీకే చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్, ఆర్జేడీ బలహీన పడగా.. జేడీయూ-బీజేపీ కూటమికి ప్రత్యామ్నాయంగా పీకే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.


By February 18, 2020 at 01:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/political-strategist-prashant-kishor-starting-baat-bihar-ki-program-from-20th-february/articleshow/74187950.cms

No comments