Breaking News

ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 17 మంది మృతి


తమిళనాడులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరువూరు జిల్లా అవినాశి వద్ద కేరళకు చెందిన ఆర్టీసీ బస్సును భారీ కంటైనర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20మంది మృతి చెందగా, మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందన బస్సు బెంగళూరు నుంచి ఎర్నాకులం వెళ్తుండగా తిరువూరు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా బస్సులోని ప్రయాణికులే కాగా, వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. బుధవారం రాత్రి 48 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి బయలుదేరిన వోల్వో బస్సును గురువారం తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో అవినాశి వద్ద భారీ కంటెయినర్ ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, 10 మంది ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో చాలా మంది త్రిసూర్, పాలక్కడ్, ఎర్నాకులం ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా చనిపోయినట్టు కేరళ రవాణా మంత్రి ఏకీ శశీంద్రన్ తెలిపారు. కంటెయినర్ టైర్లు పేలిపోవడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన మరో 23 మందికి అవినాశి హాస్పిటల్‌లో చికిత్స అందజేస్తున్నారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం అవినాశి హాస్పిటల్‌కు తరలించారు. మారుమూల ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఫైర్, పోలీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కేసు నమోదుచేసిన పోలీసులు మృతదేహాలను కోయంబత్తూరు, తిరుపూర్ హాస్పిటల్‌కు తరలించారు.


By February 20, 2020 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-16-killed-road-accident-ksrtc-bus-collides-with-container-in-coimbatore-in-tamil-nadu/articleshow/74218420.cms

No comments