Breaking News

Mahesh Babuకు ఏపీ రాజధాని సెగ.. ఇంటి ముందు ధర్నా


నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దని రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఆందోళన కాస్త హైదరాబాద్‌కూ పాకింది. శుక్రవారం సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇంటి ముందు ఏపీ రాజధాని కోసం నిరాహార దీక్ష చేపట్టారు. నగరంలోని ఫిలింనగర్‌లో జై ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి నాయకులు దీక్షకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏపీకి చెందిన సినిమా హీరోలు, నటులు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 19 వరకూ హీరోల ఇంటి ఎదుట ఆందోళన చేస్తామంటూ వారు ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ విద్యార్థి యువజన పోరాట సమితి అధ్యక్షుడు షేక్ జిలాని మీడియాతో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు అమరావతి వైజాగ్‌లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలని చెబుతున్నారు. కాగా.. ధర్నా చేపడుతున్నవారిలో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారట. అయితే ఈ వ్యవహారంపై మహేశ్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఏపీ రాజధాని అంశంపై ప్రముఖ గాయని స్మిత, సినీ నటుడు నారా రోహిత్ స్పందించిన సంగతి తెలిసిందే. READ ALSO: ‘‘ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేనిది. విభజనతో జీవచ్ఛవంలా మిగిలిన రాష్ట్రానికి.. ప్రాణసమానమైన భూముల త్యాగం చేసి అమరావతి రూపంలో ప్రాణం పోశారు. మీ ఔదార్యంతో అమరావతిలో పాలనకు బాటలు వేశారు. ఆ మార్గం చెదిరిపోకూడదని 23 రోజులుగా మీరు చేస్తున్న పోరాటం భావితరాలకు స్పూర్తిదాయకం. మీ ఉద్యమానికి సంకెళ్లు పడుతున్నా.. అలసిన గుండెలు మూగబోతున్నా మొక్కవోని దీక్షతో ముందడుగు వేస్తున్నారు. మీ పోరాటం వృథా కాదు. త్వరలో మీతో కలిసి మీ పోరాటంలో పాలు పంచుకుంటాను’’ అని రోహిత్ తన ఫేస్‌బుక్ పోస్టులో రోహిత్ వెల్లడించారు. See Photo Story:


By January 10, 2020 at 12:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/students-protest-at-mahesh-babus-residence-demands-amaravathi-to-be-the-capital-of-ap/articleshow/73184669.cms

No comments