Breaking News

Jaanu First Look: 96 రీమేక్‌ ఫస్ట్ లుక్‌.. సమంత లేకుండానే!


కోలీవుడ్‌లో 2018లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా `96`. త్రిష, విజయ్‌ సేతుపతి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించటంతో పాటు అదే స్థాయిలో అవార్డులు, రివార్లు సాధించింది. ఇప్పటికీ పలు జాతీయ అంతర్జాతీయ వేదికల మీద ఈ సినిమాను ప్రదర్శితమవుతుండటం విశేషం. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు నిర్మాతగా రీమేక్‌ చేస్తున్నారు. త్రిష, విజయ్‌ సేతుపతి నటించిన పాత్రల్లో తెలుుగులో , శర్వానంద్‌లు నటిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో పాటు టైటిల్‌ లోగోను రివీల్‌ చేశారు చిత్రయూనిట్. ఎమోషనల్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా ఓ సింపుల్‌ పోస్టర్‌తో టైటిల్‌ను ఎనౌన్స్‌ చేశారు. Also Read: పోస్టర్‌తో హీరో క్యారెక్టర్‌కు సంబంధించిన హింట్ ఇచ్చారు. ఎడారిలో ఒంటెను ఫోటో తీస్తున్నట్టుగా ఉన్న శర్వానంద్‌ స్టిల్‌ రిలీజ్‌ అయ్యింది. అంటే ఈ సినిమాతో శర్వా వైల్డ్‌ లైఫ్‌ ఫోటోగ్రాఫర్‌గా కనిపించనున్నాడన్న మాట. అయితే పోస్టర్‌లు సమంత లుక్‌ను రివీల్ చేయకపోవటం అభిమానులకు నిరాశకలిగిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ఒరిజినల్ వర్షన్‌ 96కు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ సంగీత దర్శకుడు గోవింద వసంత సంగీతమందిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన చిత్రీకరణ సమయంలో పార్‌గ్లైడింగ్‌చేస్తూ శర్వానంద్‌ గాయపడటంతో సినిమా ఆలస్యమైంది. Also Read:


By January 07, 2020 at 12:18PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/96-movie-telugu-remake-samantha-sharwanands-jaanu-first-look-poster/articleshow/73134269.cms

No comments