Breaking News

హైదరాబాద్‌‌లో విషాదం.. గూగుల్‌‌లో సెర్చ్ చేసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ


జీవితంపై విరక్తి చెందిన యువకుడు చేసుకున్న ఘటన హైదరాబాద్‌ నగరంలో సోమవారం వెలుగు చూసింది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణానికి చెందిన రంగినీధి మౌళీధర్‌(29)కు తల్లిదండ్రులు లేరు. హైదరాబాద్‌ పుప్పాలగూడ దుర్గానగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ పెంట్‌ హౌస్‌లో నివాసముంటూ ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాడు. అతడి చెల్లి శ్రావణి కూడా నగరంలోనే ఉద్యోగం చేస్తూ మాదాపూర్‌లోని లేడీస్ హాస్టల్‌లో ఉంటోంది. Also Read: తల్లిదండ్రులు లేకపోవడంతో, ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో జీవితంపై విరక్తి చెందిన మౌళీధర్‌ ఈ నెల 2వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజులు బంధువులు, స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో అనుమానం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం మాదాపూర్‌లోనే ఉండే వారి బంధువొకరు శ్రావణి వద్దకు వచ్చి మౌళీధర్‌ ఫోన్‌లో అందుబాటులోకి రావడంలేదని చెప్పాడు. దీంతో వారిద్దరూ పుప్పాలగూడ వచ్చి చూడగా మౌళీధర్‌ చనిపోయి ఉన్నాడు. Also Read: దీంతో నార్సింగి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కాసేపటికే వారు అక్కడికి చేరుకున్నారు. నోట్లో గ్యాస్‌ పైపు పెట్టుకుని, ముఖానికి నల్లటి కవర్ కప్పుకుని మౌళీధర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. జీవితంపై విరక్తితోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని మౌళీధర్‌ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. అతడి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మౌళీధర్‌ సులభంగా ఎలా చనిపోవాలో తెలుసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 07, 2020 at 12:02PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/techie-commits-suicide-in-hyderabad-while-searching-suicide-ways-in-google/articleshow/73134139.cms

No comments