Iran Missile Attack మరో ఇరాన్ జనరల్ హత్యకు అమెరికా విఫలయత్నం
బాగ్దాద్ విమానాశ్రయంపై రాకెట్ దాడిచేసి ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చిన విషయం తెలిసిందే. అయితే, అదే రోజు ఇరాన్ సైన్యానికి చెందిన మరో సీనియర్ అధికారిని కూడా యమెన్‌లో అంతంచేయడానికి అమెరికా సైన్యం విఫలయత్నం చేసినట్టు యూఎస్ అధికార వర్గాలు వెల్లడించాయి. తొలి టార్గెట్ ఖాసిం సులేమానీ కాగా, రెండో టార్గెట్‌ను యెమెన్ సరిహద్దుల్లో ఇరాన్ ఆర్మీ సీనియన్ నేతను హత్యచేయడానికి వ్యూహరచన చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి అమెరికా విస్తృత ప్రణాళికలు రచించింది. ఇరాన్ సామర్థ్యాన్ని నిర్వీర్యం చేయడానికి అమెరికా ఈ కుట్రలకు తెరతీసింది. అయితే, ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడుల తరువాత.. పశ్చిమాసియాలో ఉద్రిక్త మరింత తీవ్రతరం అవుతుందని భావించారు. కానీ, తాము ప్రతీకార దాడికి పాల్పడబోమని అమెరికా స్పష్టం చేయడంతో ఇరు దేశాలు వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నాయి. యెమెన్‌లోని ఖుద్స్ ఫోర్స్‌కే నేతృత్వం వహించే అబ్దుల్ రేజా షహలైను చంపడానికి అమెరికా ప్రయత్నించినా అది విజయవంతం కాలేదు. సులేమానీ తర్వాత రివల్యూషనరీ గార్డ్స్ మిలీషియా దళంలో షాలీ అత్యంత కీలకమైన వ్యక్తి. ఆర్ధిక వ్యవహారాలన్నీ ఆయనే పర్యవేక్షిస్తారు. జనవరి 3నే సులేమానీ, షహలైలను రాకెట్ దాడులతో హత్యచేయడానికి అమెరికా అధ్యక్షుడు నుంచి అనుమతించినట్టు తెలుస్తోంది. ఒకే సమయంలో ఇద్దరిపై రాకెట్ దాడి జరిగినా, షాలీ తప్పించుకున్నారు. ఇరాక్‌లోని అమెరికా పౌరులు, రాయబార కార్యాలయంపై దాడుల వెనుక సులేమానీ, షహలైతోపాటు మరి కొందరు ఇరాన్ అధికారుల పాత్ర ఉన్నట్టు అగ్రరాజ్యం బలంగా నమ్ముతుంది. అందుకే షాలీ ఆచూకీ తెలిపిన వారికి 15 మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. అమెరికాలోని సౌదీ రాయబారిపై హత్యాయత్నం సహా అమెరికా, సంకీర్ణ దళాలపై దాడుల్లో షాలీ పాత్ర ఉందని, అతడిని పట్టిచ్చినవారికి మిలియన్ డాలర్లు బహుమతి ఇస్తామని తెలిపింది. బాగ్దాద్ సహా మధ్య ఆసియాలోని తమ రాయబార కార్యాలయాలు, పౌరులపై సులేమానీ నేతృత్వంలోని ఇరాన్ వ్యూహాత్మకంగా దాడులకు పాల్పడిందని రాకెట్ దాడి తర్వాత డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
By January 12, 2020 at 11:44AM
No comments