కాబోయే భార్య కాల్‌గర్ల్ అయిన తెలిసి షాకైన యువకుడు.. ఆఖర్లో అదిరే ట్విస్ట్
ఎన్నో ఆశలతో పెళ్లికి సిద్ధమైన ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది. తనకు కాబోయే భార్య కాల్‌గర్ల్ అని తెలియడంతో కుమిలిపోయాడు. చివరికి అసలు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్నో ట్విస్టులతో కూడా ఈ ఘటన గుజరాత్‌లో వెలుగుచూసింది. నగరానికి చెందిన ఓ యువకుడికి కొన్నాళ్ల క్రితం అదే నగరానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇద్దరూ రోజూ సెల్‌ఫోన్లో ముచ్చట్లు చెప్పుకుంటూ ఛాటింగ్ కూడా చేసుకునేవారు. ఈ క్రమంలో ఆ యువతి తన ఫోటోలు కాబోయే భర్తకు పంపించగా.. అతడు దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు. Also Read: కొద్దిరోజుల తర్వాత ఆ యువకుడి వాట్సాప్‌కు ఓ గుర్తుతెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. కాల్‌గర్ల్స్ కావాలంటే సంప్రదించాలంటూ కొన్ని ఫోటోలు కూడా అవతలి వ్యక్తి పంపించాడు. దాన్ని ఓపెన్ చేసి చూసిన ఆ యువకుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తనకు కాబోయే భార్య అర్ధనగ్నంగా ఉన్న ఫోటోను చూసి కంగుతిన్నాడు. తాను పెళ్లి చేసుకునేది వేశ్యనా అంటూ తనలో తానే కుమిలిపోయాడు. దీంతో ఆమెకు ఫోన్ చేసి తనను ఎందుకు మోసం చేశావంటూ నిలదీశాడు. Also Read: దీంతో షాక్‌కు గురైన ఆ యువతి తనకే పాపం తెలీదని మొత్తుకుంది. అయినా వినని ఆ యువకుడు పెళ్లిని రద్దు చేయిస్తానంటూ చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన ఆ యువతి ఆ ఫోటోను తనకు పంపించాలని అతడిని కోరింది. ఆమె చెప్పినట్లే ఆ ఫోటోను పంపించగా అసలు విషయాన్ని పట్టేసింది. ఆ ఫోటో కాబోయే భర్తకు పంపించిందని, దాన్ని ఎవరో మార్ఫింగ్ చేసి కాల్‌గర్ల్‌గా చిత్రీకరించారని నిర్ధారించుకుంది. ఇదే విషయాన్ని కాబోయే భర్తకు చెప్పగా అతడు క్షమించాలని కోరాడు. ఇద్దరూ కలిసి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితులను శిక్షించాలని కోరారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐపీ అడ్రస్ ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. Also Read:
By January 12, 2020 at 11:18AM
No comments