Breaking News

రాములో రాములా ‘బుడ్డోడు’ ఇరగదీసిండురో.. బన్నీ షాకవ్వాల్సిందే


‘‘రాములో రాములా నన్నాగం చేసిందిరో’’.. ఈ పాట వినగానే ఎవరికైనా ఊపురావాల్సిందే. ఆ హాఫ్ కోట్ స్టెప్‌ను దాదాపు స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ నేర్చేసుకుని ఉంటారు. కానీ ఈ బుడ్డోడి డ్యా్న్స్ చూస్తే బన్నీ కూడా షాకవ్వాల్సిందే. ఎవరో తెలీదు కానీ ఓ కార్యక్రమంలో ఓ పదేళ్ల పిల్లాడు పాటకు డ్యాన్స్ చేశాడు. ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేశాడంటే అక్కడున్నవారంతా చప్పట్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేశారు. ప్రకాశ్ కళ్యాణ్ అనే ఓ నెటిజన్‌ ఆ డ్యాన్స్ వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘నా బుడ్డోడు రాములో రాములా పాటకు డ్యాన్స్ చేశాడు. తమన్ అన్నా ఎలా ఉంది. నీ రిప్లై కోసం ఎదురుచూస్తున్నాం’ అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు గీతా ఆర్ట్స్ కంటెంట్ అండ్ డిజిటల్ హెడ్ శరత్ చంద్ర నాయుడు స్పందించారు. ఈ బుడ్డోడి వివరాలు తెలిస్తే పంపండి అని ట్వీట్ చేశారు. ఆ బాలుడిది తిరుపతి అని కొందరు, టిక్ టాక్ ఐడీతో చెక్ చేస్తే వివరాలు తెలుస్తాయని మరికొందరు కామెంట్స్ పెట్టారు. READ ALSO: అయితే ‘అల వైకుంఠపురంలో’ సినిమాకు థియేటర్స్ పెంచాలని ఫ్యాన్స్ గొడవ చేస్తున్నారు. థియేటర్స్ పెంచకపోతే ఆ బుడ్డోడ్ని కిడ్నాప్ చేస్తామంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ‘అల వైకుంఠపురంలో’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేశారు. తమన్ సంగీతం అందించారు. READ ALSO:


By January 11, 2020 at 10:43AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ramuloo-ramulaa-song-performance-by-a-kid-is-going-viral-on-social-media/articleshow/73199262.cms

No comments