అంత సేపు నయన్ ఎందుకు ఏడ్చినట్లు.. కారణం ఎవరు?
పవర్‌ఫుల్ పాత్రలతో తన పవరేంటో చిత్ర పరిశ్రమకు చూపించిన నటి . ఆమె బయటికి ఎంత బోల్డ్‌గా కనిపించినా మనసు మాత్రం చాలా సున్నితం. అందుకే ప్రపంచంలోనే తనకు ఇష్టమైన వ్యక్తి కోసం నయన్ కన్నీరుపెట్టుకున్నారు. ఆ వ్యక్తి విఘ్నేష్ శివన్ అనుకుంటే మీరు పొరబడినట్లే. ఆ వ్యక్తి నయన్ అన్న కూతురు ఏంజిలినా. అవును, మేనకోడలు ఏంజిలినా అంటే నయన్‌కు ప్రాణం అట. అంతేకాదు నయన్ జీవితంలో ఏంజిలినా లక్కీ చార్మ్. ఎందుకంటే ఏంజిలినా పుట్టిన తర్వాతే నయన్‌కు అన్నీ కలిసొచ్చాయి. ప్రతీ క్రిస్మస్ పండుగను నయన్ తన మేనకోడలితోనే జరుపుకునేవారు. కానీ 2019లో మాత్రం ఏంజిలినా వద్ద నయన్ ఉండలేకపోయారట. ఈ విషయాన్ని నయన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ సమయంలో నయన్.. తన ప్రియుడు విఘ్నేష్‌తో కలిసి న్యూయార్క్ వెళ్లారు. ఏంజిలినా పక్కన లేనందుకు నయన్ దాదాపు గంట సేపు వెక్కి వెక్కి ఏడ్చారట. దీనిని బట్టే అర్థమవుతోంది నయన్‌ది ఎంత సున్నితమైన మనసో. READ ALSO: ఇకపోతే సూపర్‌స్టార్ రజినీకాంత్, నయనతార జంటగా నటించిన ‘దర్బార్’ సినిమా గురువారం విడుదలై బ్లాక్ బస్టర్ కలెక్షన్ల వైపు దూసుకెళ్తోంది. ప్రస్తుతం నయన్.. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘మూకుత్తి అమ్మన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో నయన్ అమ్మవారి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలోనూ నయన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. READ ALSO:
By January 11, 2020 at 10:27AM
No comments