Breaking News

మహిళను స్తంభానికి కట్టేసి.. రాళ్లు, చెప్పులతో కొట్టి..


తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను స్తంభానికి కట్టేసి.. రాళ్లు, చెప్పులతో దారుణంగా కొట్టారు. పొలం వద్ద దారి విషయంలో మహిళల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో ఓ మహిళను విద్యుత్‌ స్తంభానికి తాళ్లతో కట్టేసి చెప్పులతో దాడి చేశారు. ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ తెలిపిన వివరాల మేరకు.. జిల్లా కోహెడ మండలం పోరెడ్డిపల్లి తండాకు చెందిన గుగులోతు జ్యోతి, లక్ష్మీపూర్‌ గ్రామానికి చెందిన గుగులోతు హంస, స్వరూపలకు చెందిన వ్యవసాయ భూములు పోరెడ్డిపల్లి తండా గ్రామ పరిధిలో ఉన్నాయి. Also Read: ఈ క్రమంలో వ్యవసాయ బావులకు వెళ్లే రహదారి విషయమై ఆ మహిళలు తరచూ గొడవలకు పాల్పడేవారు. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న హంస, స్వరూప.. గురువారం సాయంత్రం ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న జ్యోతిని గమనించారు. అనంతరం కృష్ణ అనే వ్యక్తి సాయంతో జ్యోతిని బలవంతంగా ట్రాక్టర్‌లో ఎక్కించుకొని లక్ష్మీపూర్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఆమెను స్తంభానికి కట్టేసి చెప్పులతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఇది గమనించిన స్థానికులు వెంటనే 100కు పోన్ చేశారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం బాధితురాలి భర్త శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు హంస, కృష్ణ, స్వరూప, శంకర్, కైలు, రమలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. Also Read:


By January 11, 2020 at 10:59AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-woman-tied-to-pole-beaten-with-stones-and-slippers/articleshow/73199152.cms

No comments