సీఎం జగన్ సొంత జిల్లాలో దారుణం... బాలికను పొదల్లోకి తీసుకెళ్లి

జిల్లా బద్వేలు పట్టణంలో దారుణం జరిగింది. ఓ కాలనీకి చెందిన మైనర్ బాలికపై కామాంధుడు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. స్థానికుల చొరవతో సోమవారం ఈ దారుణం వెలుగు చూసింది. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి బాధితురాలికి పినతండ్రి అవుతాడు. Also Read: సోమవారం కాలనీ శివారులోని ఓ ప్రాంతంలో బాలిక ముళ్ల పొదల్లో భయంభయంగా వణుకుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. ఆమెను బయటకు తీసుకొచ్చి ఏం జరిగిందని ఆరా తీయగా బాబాయ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. సోమవారం ఐసీడీఎస్ అధికారులు ఎస్సై లలిత ఆధ్వర్యంలో ఘటనపై విచారణ జరిపి ఆమెపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: బాలిక తల్లి, తండ్రి కొంతకాలం క్రితం విడిపోయారు. బాలిక ప్రస్తుతం తల్లి సంరక్షణలో ఉన్నారు. తల్లీకూతుళ్లు కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరితో పాటే నిందితుడు కూడా ఉంటున్నాడు. బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు ఆదివారం రాత్రి ఆమె నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితురాలు ఐసీడీఎస్ అధికారిణులు, మహిళా పోలీసుల సంరక్షణలో ఉంది. Also Read:
By January 07, 2020 at 08:49AM
No comments