Breaking News

వివాహితను ఎత్తుకెళ్లి పత్తి చేలో ఏడుగురి గ్యాంగ్ రేప్.. ఖమ్మంలో దారుణం


ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ తర్వాతైనా నేరాలు కాస్త తగ్గుముఖం పడతాయని అందరూ ఆశించారు. కానీ అనూహ్యంగా మరింతగా నేరాలు పెరగడం కలవరపెడుతోంది. తాజాగా వివాహితపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. Also Read: రఘునాథపాలెం మండలానికి చెందిన వివాహిత(35) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తోంది. రాత్రి 10 గంటల తరువాత ఇద్దరు యువకులు రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించి, ఆమెను బలవంతంగా బైక్‌పై ఎత్తుకెళ్లారు. ఆమె కేకలు పెట్టకుండా నోట్లో గుడ్డలు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. దారిలో మరికొందరు యువకులు వారికి తోడై అందరూ కలిసి ఆమెను అదే మండలం హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. Also Read: వివాహితను ఎత్తకెళ్తున్న సమయంలో ఆమె పక్కింట్లోని ఓ యువకుడు చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పెట్రోలింగ్ పోలీసులు మహిళ ఆచూకీ కనుగొని అక్కడికి వచ్చేసరికే నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి పరారయ్యారు. దీంతో బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. తనపై హర్యాతండాకు చెందిన బాణోతు మోహన్‌, బాణోతు ఉపేందర్‌, అంగోతు కల్యాణ్‌, బాణోతు చంటి, అజ్మీరా నాగేశ్వరరావు, సుకినీ తండాకు చెందిన మాలోతు అశోక్‌, బి. సునీల్‌ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: సంఘటనా స్థలాన్ని ఖమ్మం అడిషనల్‌ డీసీపీ ఇంజారపు పూజ, రూరల్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి శనివారం పరిశీలించారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని బాధితురాలి బంధువులు, గ్రామస్థులు శనివారం రఘునాథపాలెం పోలీసుస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ కేసులో ఓ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read:


By January 26, 2020 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/woman-gang-raped-by-7-men-in-khammam-district-one-accused-arrested/articleshow/73626127.cms

No comments