మసాజ్ పార్లర్ ముసుగులో సెక్స్ దందా.. నివ్వెరపోయిన పోలీసులు

వ్యభిచార దందా సాగించేందుకు రకరకాల వక్ర మార్గాలు వెతుకుతున్నారు. కొందరు ఆన్‌లైన్ ద్వారా ఈ వ్యవహారం నడిపిస్తుంటే మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా ఇళ్ల మధ్యలోనే ఈ దందా సాగిస్తున్నారు. అమ్మాయిలకు డబ్బు, ఉద్యోగాల ఆశ చూపి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారు. తాజాగా, బంగళూరులో పార్లర్ ముసుగులో నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు ఛేదించారు. సోమవారం మసాజ్ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న కేంద్రంపై సీసీబీ పోలీసులు దాడిచేసి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదుగురు యువతులను కాపాడారు. Also Read: దక్షిణ బెంగళూరులోని బనశంకరి ప్రాంతం కోరమంగల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ భవనంలో స్పా మసాజ్ హ్యాపీ వెడ్డింగ్ అనే పార్లర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. పక్కా సమాచారం అందుకున్న సీసీబీ పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచారం కోసం పార్లర్‌లో చేసిన ఏర్పాట్లను చూసి పోలీసులు నివ్వెరపోయారు. అనంతరం ఈ దందా నిర్వహిస్తున్న ఇన్వెంట్ క్రిస్టి సునీల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి ఐదుగురు యువతులకు వ్యభిచారం రొంపి నుంచి విముక్తి కల్పించారు. సులభంగా డబ్బు సంపాదించే ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బయటి రాష్ట్రాలకు చెందిన యువతులను నిర్వాహకులు ఇక్కడికి రప్పించుకుంటున్నట్లు తెలిసింది. అనంతరం వారిని వ్యభిచార రొంపిలోకి దించుతున్నట్లు విచారణలో తేలింది. కాగా, ఈ వ్యవహారానికి సంబంధించి రాజేశ్, మోసిస్ట్ అనే ఇద్దరి సూత్రధారులు పరారీలో ఉన్నారు. Also Read:
By January 14, 2020 at 11:34AM
No comments