Breaking News

గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. ఐదుగురు చీరాల వాసుల దుర్మరణం


గుజరాత్‌లో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ఐదుగురు దుర్మరణం పాలవ్వగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. మండం జాండ్రపేటకు చెందిన బొడ్డు నాగేంద్రం రాజధాని అహ్మదాబాద్‌లోని ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్నారు. భార్య దుర్గాభవాని(22), పిల్లలు మాధురి, రుషిక్‌‌లో కలిసి అక్కడే నివాసముంటున్నారు. ఇటీవలే ఆయన స్వస్థలానికి వచ్చిన ఆయన తాముండే ప్రాంతానికి సోమనాథ్‌ ఆలయం దగ్గరేనని తనతో వస్తే ఆ యాత్రకు వెళ్దామని సమీప బంధువైన కామిశెట్టి సుబ్రహ్మణ్యం(43)కు చెప్పారు. Also Read: దీంతో నాగేంద్రం కుటుంబంతో కలిసి... సుబ్రహ్మణ్యం, ఆయన భార్య రాజ్యలక్ష్మి (39), కుమారుడు గణేష్‌ (24)తో పాటు సుబ్రహ్మణ్యం తమ్ముడి పిల్లలు కుశలత, అఖిల్‌ (11) ఈ నెల 8న రైలులో అహ్మదాబాద్‌ వెళ్లారు. సోమనాథ్‌ యాత్ర ముగించుకుని శనివారం రాత్రి అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వాహనంలో బయలుదేరారు. సురేంద్రనగర్‌ జిల్లా దేవ్‌పారా గ్రామ సమీపంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. Also Read: ఈ దుర్ఘటనలో సుబ్రహ్మణ్యం, రాజ్యలక్ష్మి, గణేష్, అఖిల్, దుర్గాభవాని అక్కడికక్కడే మృతిచెందగా... కుశలత, నాగేంద్ర, రుషిక్‌, మాధురి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మాధురి ప్రాణాపాయం నుంచి బయటపడగా.. మిగిలిన వారి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ ఘటనతో జాండ్రపేటలో తీవ్ర విషాదం నెలకొంది. తీర్థయాత్ర కోసమని ఉత్సాహంగా వెళ్లిన తమవారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తెలిసి వారి బంధువులు, సన్నిహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:


By January 20, 2020 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/road-accident-in-gujarat-5-prakasam-district-people-died-4-injured/articleshow/73417743.cms

No comments