Breaking News

గుంటూరులో దారుణం.. భర్త లేని సమయంలో ఇంట్లో దూరి మహిళపై అఘాయిత్యం


జిల్లాలో మరో దారుణం వెలుగుచూసింది. భర్త బయటకు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై ఇద్దరు దుండుగులు అత్యాచారానికి యత్నించారు. అయితే బాధితురాలు సకాలంలో ధైర్యంగా వ్యవహరించడంతో ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకుంది. Also Read: గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం నార్నెపాడు గ్రామంలో ఓ మూగ మహిళ భర్తతో కలిసి జీవిస్తోంది. శనివారం రాత్రి ఆమె భర్త ఏదో పని నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ విషయాన్ని గమనించిన అదే గ్రామానికి చెందిన రావిపాటి గోపి, కనుమూరి లక్ష్మణరావు దొంగచాటుగా ఇంట్లోకి దూరి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. ఆమె కేకలు వేయకుండా నోరు నొక్కేసి దుస్తులు విప్పేందుకు యత్నించారు. Also Read: అయితే ధైర్యం చేసిన బాధితురాలు వారిని తోసేసి గట్టిగా కేకలు వేయడంతో కామాంధులు పరారయ్యారు. కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన భర్తకు ఆమె సైగలతో విషయం చెప్పడంతో వెంటనే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. Also Read:


By January 20, 2020 at 12:02PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/married-woman-escaped-from-rapists-in-guntur-district/articleshow/73420030.cms

No comments