Breaking News

చీరకొంగుకు మంటలు అంటుకుని మహిళ సజీవ దహనం


నిరుపేద కుటుంబం వారిది. రోజూ భార్యాభర్తలు అప్పడాలు, ఒడియాలు తయారుచేసి ఆమదాలవలసలోని దుకాణాలకు, స్థానికులకు విక్రయిస్తుంటారు. ఆ విధంగా కూడబెట్టిన సంపాదనతోనే ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేశారు. సంక్రాంతి పండగకు రావలసిందిగా ఇటీవల కూతుళ్లు, అల్లుళ్లను పిలిచారు. వచ్చే వారికి పండగ కానుకలను అందించాలని అప్పడాలు, ఒడియాల విక్రయాలను ముమ్మరం చేశారు. మరికొద్దిరోజుల్లో కూతుళ్లు, అల్లుళ్లుతో సందడిగా మారనున్న ఆ ఇంట్లో అనుకోని ఘోరం జరిగిపోయింది. పండగకు పిల్లల రాక కోసం ఎదురుచూస్తున్న ఆ తల్లి మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన జిల్లా ఆమదాలవలసలోని మెట్టక్కివలసలో బుధవారం ఉదయం విషాదం నింపింది. Also Read: ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని మెట్టక్కివలసలో సుమారు 40 ఏళ్లుగా తంగుడు శ్యామల, శంకరావులు నివాసం ఉంటున్నారు. అప్పడాలు, వడియాలు తయారుచేసి దుకాణాలకు విక్రయిస్తూ బతుకీడుస్తున్నారు. రోజులానే బుధవారం ఉదయం లేచిన శ్యామల(53) స్నానం చేసేందుకు గ్యాస్‌స్టౌవ్‌పై వేడినీళ్లు పెట్టింది. ఇంతలో ఆమె చీర కొంగుకు మంటలు అంటుకున్నాయి. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించడంతో ఆమె మంటల్లో చిక్కుకుంది. భయంతో కేకలు పెడుతూ వెళ్లి ఇంట్లో సజీవ దహనమైంది. ఆ సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లడంతో ఆమెను కాపాడేందుకు ఎవరూ అందుబాటులో లేకపోయారు. Also Read: కాసేపటి తర్వాత ఇంటికొచ్చిన భర్త ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయాడు. మంటల్లో కాలిపోయిన తన జీవిత భాగస్వామిని చూసి షాక్‌లోకి వెళ్లిపోయాడు. ఈ ఘటనతో మెట్టక్కివలస ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలి భర్త శంకరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 09, 2020 at 11:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/srikakulam-woman-burned-a-live-in-house/articleshow/73167078.cms

No comments