Breaking News

మహిళలపై నేరాల్లో టాప్-5లో తెలంగాణ.. తగ్గిన హత్యలు.. పెరిగిన కిడ్నాప్‌లు


2018లో మహిళలపై జరిగిన నేరాల్లో రాష్ట్రం జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాలకు సంబంధించి ఆ సంవత్సరంలో మొత్తం 16,027 కేసులు నమోదయ్యాయి. వరకట్న వేధింపుల వల్ల 186 మంది మృతిచెందగా, 10 మందిపై యాసిడ్ దాడి జరిగింది. వేధింపులు ఇతర కారణాలతో 459 మంది మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆరుగురు అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో 2018 నివేదిక వెల్లడించింది. మహిళలపై నేరాల సంఖ్య 2017లో పోలిస్తే 2018లో కాస్త తగ్గుముఖం పట్టిందనే చెప్పాలి. Also Read: దేశవ్యాప్తంగా ఐపీసీ సెక్షన్ల కింద 31,32,954 కేసులు నమోదవగా తెలంగాణలో వాటి సంఖ్య 1,13,951గా ఉంది. 2017లో ఐపీసీ కింద నమోదైన కేసుల సంఖ్య 1,19,858 కాగా మరుసటి ఏడాదిలోనే 5,907 కేసులు పెరిగాయి. ఐపీసీ కింద నమోదైన నేరాల్లో 19 నగరాల జాబితాలో హైదరాబాద్‌కు 11వ స్థానం దక్కింది. మహిళలపై నేరాల్లో మాత్రం ఐదో స్థానంలో నిలిచింది. Also Read: 18 ఏళ్లలోపు వయసు కలిగి కనిపించకుండా పోయిన వారికి సంబంధించి 3,090 కేసులు నమోదు కాగా.. వీరిలో 75 శాతం మందిని పోలీసులు వెతికి పట్టుకున్నారు. తెలంగాణలో 2017లో 805 హత్యలు జరగ్గా 2018లో ఆ సంఖ్య 786కు తగ్గింది. 2017లో 1,560 కిడ్నాప్‌‌లు జరిగితే.. 2018లో ఆ సంఖ్య 1,810కి పెరిగింది. అవినీతి నిరోధక చట్టం కింద 139 నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.160.6కోట్ల సొమ్ము చోరీకి గురికాగా.. పోలీసులు రూ.113.4 కోట్లు రికవరీ చేశారు. Also Read:


By January 10, 2020 at 11:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/786-murders-1810-rapes-in-2018-in-telangana-ncrb-data/articleshow/73183465.cms

No comments