హైదరాబాద్‌లో కీచకపర్వం.. నడిరోడ్డుపై కూతురిని ఎత్తుకెళ్లి తల్లికి లైంగిక వేధింపులు

హైదరాబాద్‌లో మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిత్యం ఎక్కడో చోట మహిళలు, యువతులు, చిన్నారులపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నిత్యం రద్దీగా ఉండే బంజారాహిల్స్ ప్రాంతంలో ఇద్దరు యువకులు తల్లీకూతుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. Also Read: బంజారాహిల్స్ రోడ్ నెం 13లోని గౌరీశంకర్ కాలనీలో నివసిస్తున్న లక్ష్మి అనే వివాహిత తన ఏడేళ్ల కూతురితో కలిసి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో వైట్‌హౌస్ మీదుగా గౌరీశంకర్ నగర్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. వైట్‌హౌస్ వెనకాల రోడ్డు వద్దకు రాగానే ఇద్దరు యువకులు స్కూటీ మీద వచ్చి అడ్డగించారు. వీరిలో ఓ యువకుడు ఆమె కూతురును బలవంతంగా లాక్కుని వెళ్లిపోగా.. మరో యువకుడు మహిళపై అసభ్యంగా ప్రవర్తించాడు. చీర లాగేందుకు ప్రయత్నించగా బాధితురాలు గట్టిగా కేకలు పెట్టింది. దీంతో ఆ యువకుడు ఆమెను నెట్టేసి వెళ్లిపోయాడు. Also Read: కూతురిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియకపోవడంతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లగా గదిలో కూతురు కనిపించింది. దీంతో ఇది తెలిసిన వారి పనేనని భావించిన ఆ మహిళ వెంటనే సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై ఐపీసీ 354, 323, 341 సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. Also Read:
By January 28, 2020 at 09:28AM
No comments