Breaking News

హాస్టల్లోనే బిడ్డను ప్రసవించిన విద్యార్థిని.. వార్డెన్‌పై వేటు


ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్‌లోనే బిడ్డకు జన్మనివ్వడం కలకలం రేపింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన దంతేవాడ జిల్లాలోని పతర్రాస్ ప్రాంతంలో ఉన్న పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. Also Read: హాస్టల్‌ గదిలో ఉన్న బాలికకు సడెన్‌గా నొప్పులు రావడంతో తోటి విద్యార్థినులు వార్డెన్ సాయంతో ఆస్పత్రికి తరలించారు. కాసేపటికే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా డిప్యూటీ కలెక్టర్ హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితురాలితో పాటు ఆస్పత్రి సిబ్బందిని, హాస్టల్ వార్డెన్‌ను, తోటి విద్యార్థినులను విచారించారు. తాను రెండేళ్లుగా ఓ యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నానని, అతడితో హద్దులు దాటడంతోనే గర్భం దాల్చినట్లు బాధితురాలు అధికారులకు చెప్పింది. Also Read: ఈ విషయం తెలిస్తే పరువు పోతుందన్న భయంలో తల్లిదండ్రులకు కూడా చెప్పలేదని బాలిక చెబుతోంది. అయితే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్‌ను అధికారులు సస్పండ్ చేశారు. బాలికకు హాస్టల్‌లో ప్రసవించే వరకు ఏం చేస్తున్నారని అధికారులు వార్డెన్‌పై మండిపడ్డారు. శిశువును బాలిక తల్లిదండ్రులకు అప్పగించి... దీనిపై విచారణ చేపట్టారు. Also Read:


By January 19, 2020 at 10:51AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/class-11-girl-delivers-baby-in-chhattisgarh-schools-hostel/articleshow/73370231.cms

No comments