Breaking News

వరంగల్‌ మహిళపై ఢిల్లీలో అత్యాచారం.. షాక్‌లోకి వెళ్లిపోయిన బాధితురాలు


వరంగల్‌‌కు చెందిన 32ఏళ్ల మహిళ ప్రియుడి చేతిలో అత్యాచారానికి గురైన ఘటన ఆలస్యంలో వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడు గుట్టచప్పుడు కాకుండా తీసుకొచ్చి హన్మకొండలోని ఆమె ఇంటి వద్ద దించేసి పరారయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి బాధితురాలు షాక్‌‌లోకి వెళ్లిపోయింది. వింతవింతగా ప్రవర్తిస్తుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. Also Read: జులైవాడకు చెందిన మహిళ(32) సికింద్రాబాద్‌లోని కేథలిక్ చర్చిలో ఉద్యోగం చేస్తోంది. ఆమెకు లేబర్ కాలనీకి చెందిన పెరుమాళ్ల సందీప్‌తో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో వారిద్దరు అప్పుడప్పుడు కలుసుకుని ముచ్చట్లు చెప్పుకునేవారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 18న ఆ మహిళ శిక్షణ కోసమని సహోద్యోగులతో కలిసి ఢిల్లీకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న సందీప్ తాను కూడా ఢిల్లీ వెళ్లి ఆమెను కలిశాడు. పర్యాటక ప్రాంతాలు చూపిస్తానని నమ్మించి ఆమెను ఓ హోటల్‌కు తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: ఈ ఘటనతో బాధితురాలు షాక్‌లోకి వెళ్లిపోయింది. దీంతో సందీప్ గుట్టుచప్పుడు కాకుండా సోమవారం తెల్లవారుజామున హన్మకొండలోని ఆమె ఇంటి దగ్గర దించేసి వెళ్లిపోయాడు. ఢిల్లీ టూర్ ఎలా జరిగిందని కుటుంబసభ్యులు అడగ్గా వింత వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. దీంతో వారు ఆమె స్నేహితురాళ్లకు ఫోన్ చేసి ఆరా తీయగా సందీప్ అత్యాచారం చేసినట్లు చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు సోమవారం సుబేదారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:


By January 07, 2020 at 09:29AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/warangal-woman-raped-by-boy-friend-in-delhi-she-got-shock/articleshow/73132197.cms

No comments