Breaking News

పబ్జీ గేమ్‌కి బానిసై... మెదడు నరాలు చిట్లి యువకుడి మృతి


నేటి కాలంలో గేమ్‌‌కు ఎందరో యువత బానిసలుగా మారిపోతుండటాన్ని చూస్తూనే ఉన్నాం. దీనివల్ల చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయినప్పటికీ ఈ గేమ్‌కున్న ఆదరణ మరింత పెరుగుతుందే గానీ తగ్గడం లేదు. తాజాగా పబ్జీ గేమ్‌కు బానిసైన ఓ యువకుడు అత్యంత ప్రమాదకరస్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. Also Read: మహారాష్ట్రలోని పుణెకు చెందిన హర్షల్‌ (27) అనే యువకుడు రెండేళ్లుగా పబ్జీ గేమ్‌కి బానిసగా మారిపోయాడు. ఏ పనీ చేయకుండా రోజంతా అదే ఆటలో మునిగితేలేవాడు. పబ్జీ పిచ్చి మానుకోవాలని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. కొడుక్కి చెప్పిచెప్పి విసుగొచ్చి వారు పట్టించుకోడం మానేశారు. ఈ క్రమంలో గురువారం పబ్జీ గేమ్ ఆడుతుండగా హర్షల్‌కి గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. Also Read: పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం హర్షల్ ప్రాణాలు కోల్పోయాడు. అతడికి హార్ట్ అటాక్‌తో పాటు బ్రెయిన్ స్ట్రోక్‌ కూడా వచ్చిందని డాక్టర్లు తెలిపారు. మెదడులోని నరాలు చిట్లిపోవడంతో లోపల తీవ్ర రక్తస్రావం జరిగి చనిపోయాడని వెల్లడించారు. ఒక్కగానొక్క కొడుకు పబ్జీ పిచ్చికి ప్రాణాలు కోల్పోవడంతో అతడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. Also Read:


By January 19, 2020 at 01:02PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/pune-young-man-died-brain-stroke-while-playing-pubg-game/articleshow/73372608.cms

No comments