పరిగిలో పదేళ్ల బాలికపై అత్యాచారం.. కామాంధుడిని చితక్కొట్టిన స్థానికులు

జిల్లా పరిగిలో దారుణం జరిగింది. బీసీ కాలనీకి చెందిన పదేళ్ల బాలికపై సాయి(24) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికను మాయమాటలు చెప్పి ఊరి చివరకు తీసుకెళ్లి కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న బాలికకు తల్లిదండ్రులు లేదు. దీంతో మేనమామ ఇంట్లో ఉంటోంది. శనివారం సాయంత్రం ఆడుకునేందుకు బయటకు వెళ్లిన బాలిక రాత్రి 9 గంటలైనా తిరిగిరాలేదు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఆమె కోసం వెతకసాగారు. Also Read: కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న బాలిక అస్వస్థతకు గురైనట్లు కనిపించడంతో ఏం జరిగిందని మేనమామ ప్రశ్నించాడు. దీంతో తనపై జరిగిన దారుణాన్ని వివరించింది. జననాంగాల నుంచి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆందోళన పడిన వారు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన డాక్టర్లు అత్యాచారం జరిగినట్లు చెప్పడంతో నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. Also Read: ఈ ఘటనపై బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. Also Read:
By January 19, 2020 at 11:48AM
No comments