Breaking News

కత్తితో గొంతులో గుచ్చి... గ్రామ వాలంటీర్‌పై డిగ్రీ విద్యార్థి హత్యాయత్నం


కర్నూలు జిల్లా మండలం రాంపల్లిలో గ్రామ వాలంటీర్‌ రామానాయుడుపై అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థి దబ్బల సతీష్‌ దాడికి పాల్పడ్డాడు. న్యూ ఇయర్ సందర్భంగా రామానాయుడు మరో ఇద్దరు వాలంటీర్లతో ప్లెక్సీలు కట్టేందుకు మంగళవారం అర్ధరాత్రి వెళుతుండగా సతీష్ దారికాచి పిడిబాకుతో అతడి గొంతులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన రామానాయుడిని కుటుంబసభ్యులు చికిత్స కోసం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడ నుంచి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. Also Read: బాధితుడి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామానాయుడు తనకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తనకు రాకుండా చేశాడన్న కక్షతోనే సతీష్ ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. Also Read:


By January 02, 2020 at 09:19AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/murder-attempt-on-village-volunteer-in-kurnool-district/articleshow/73064245.cms

No comments