Breaking News

ప్రత్యర్థిపై కత్తితో దాడి. టీడీపీ నేతపై హత్యాయత్నం కేసు నమోదు


తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పోల్నాటి శేషగిరిరావుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శేషగిరిరావు ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు టి.తిమ్మాపురం గ్రామానికి చెందిన పోల్నాటి మాణిక్యం అనే వ్యక్తి గతంలో రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో డిసెంబర్ 30వ తేదీన మాణిక్యం తన పొలానికి వెళ్తుండగా శేషగిరిరావు అతడిని అడ్డగించాడు. తనపై రెవెన్యూ అధికారులకు తనపై ఎందుకు ఫిర్యాదు చేశావంటూ గొడవకు దిగాడు. Also Read: మాణిక్యం కూడా ఎదురు తిరగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఆగ్రహం చెందిన శేషగిరిరావు తన వద్ద ఉన్న కత్తితో మాణిక్యంపై దాడికి యత్నించాడు. ఆ సమయంలో కొందరు గ్రామస్థులు అటుగా రావడం గమనించి శేషగిరిరావు అక్కడి నుంచి పరారయ్యాడు. మాణిక్యం మెడపై స్వల్ప గాయం కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. అనంతరం నేరుగా తుని గ్రామీణ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో శేషగిరిరావుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 02, 2020 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/murder-attempt-case-booked-against-east-godavari-tdp-leader/articleshow/73064388.cms

No comments