కూతురితో కాపురం చేస్తే ఆయుష్షు పెరుగుతుందట.. స్వామీజీ చెప్పాడని

కన్న కూతురితో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఆయుష్షు పెరుగుతుందన్న మూఢనమ్మకంతో ఓ వ్యక్తి పైశాచానికి పాల్పడ్డాడు. కోరిక తీర్చాలంటూ బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఈ ఘటన చెన్నై సమీపంలోని ఆవడి పట్టణంలో వెలుగుచూసింది. Also Read: ఆవడి పట్టణానికి చెందిన అరుళ్ అనే వ్యక్తి(40)కి కుమార్తె(16) ఉంది. ఈ నెల 24వ తేదీన ఆ బాలిక పోలీసులకు ఫోన్ చేసి తండ్రి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లిన పోలీసులు విచారించగా అరుళ్ పదేళ్లుగా అదే ఇంట్లో ఉంటున్నట్లు చుట్టపక్కల వాళ్లు చెప్పారు. ఆరు నెలలకు ఓ సారి నామక్కల్ జిల్లా కొల్లిమలైకి వెళ్లి ధ్యానం చేస్తుంటాడని చెప్పారు. అయితే పోలీసులు వెళ్లిన సమయంలో అరుళ్ ఇంట్లో లేదు. దీంతో కుటుంబసభ్యులతో అతడికి ఫోన్ చేయించి ఇంటికి రప్పించారు. Also Read: విచారణలో కూతురిని లైంగికంగా వేధించినట్లు నిందితుడు అంగీకరించాడు. కుమార్తెతో లైంగిక సంబంధం పెట్టుకుంటే తన ఆయుష్షు పెరుగుతుందని ఓ స్వామీజీ చెప్పారని, అందుకే ఇలా చేసినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. దీంతో పోలీసులు అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మూఢనమ్మకంతో కూతురి జీవితాన్ని నాశనం చేసేందుకు యత్నించిన అరుళ్‌పై స్థానికులు మండిపడుతున్నారు. Also Read:
By January 28, 2020 at 10:53AM
No comments