Breaking News

హైదరాబాద్‌లో ఐదేళ్ల కూతుర్ని గొంతునులిమి చంపిన తండ్రి


హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. ఐదేల్ల వయసున్న కన్న కూతుర్ని ఓ కసాయి తండ్రి గొంతునులిమి చంపేశాడు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాలాజీ నగర్‌లో ఈ దారుణం జరిగింది. బాలాజీ నగర్‌లో దుర్గారావు అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే దుర్గారావు మద్యానికి బానిసయ్యాడు. Also Read: తరచూ మద్యం సేవించి ఇంటికొచ్చి గొడవ చేసేవాడు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కూడా మద్యం మత్తులో ఇంటికొచ్చాడు. అనంతరం ఇంట్లో గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో విచక్షణ కోల్పోయిన దుర్గారావు తన ఐదేళ్ల కూతురు యామిని (5)ని గొంతునులిమి పక్కలో పడేశాడు. చిన్నారి తల్లి వచ్చి గమనించగా విగతజీవిగా పడి ఉంది. దీంతో చిన్నారిని ఒడిలో ఉంచుకుని తల్లి రోదిస్తూ చుట్టుపక్కల వారి దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయం తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు తన కుమార్తెను ఎందుకు చంపాడన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:


By January 11, 2020 at 01:11PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-man-killed-his-5-year-daughter/articleshow/73200833.cms

No comments