Breaking News

క్షుద్రపూజల కోసం సొంత చెల్లినే బలిచ్చాడు


మూఢనమ్మకం అతడిని కిరాతకుడిగా మార్చేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన చెల్లినే క్షుద్రపూజల పేరుతో బలి ఇచ్చాడు. ఈ ఘటన ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా కంటాభంజి సమితి సాలబరిటి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జనని రాణా (12) అనే బాలిక కొద్దిరోజులుగా కనిపించడం లేదు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కేసులో లోతుగా దర్యాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: డిసెంబర్ 24న జనని రాణాను గ్రామంలోని బస్టాండ్‌లో దించేందుకు ఆమె అన్నయ్య సొబాబన్‌ రాణా సైకిల్‌పై తీసుకువెళ్లాడు. అనంతరం ఆమె తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కలవరపడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. నిర్వహించే సొబాబన్‌ రాణానే బాలికను ఏదైనా చేసి ఉంటాడని కుటుంబసభ్యులు అనుమానించారు. 28వ తేదీన పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టడంతో పోలీసుల సొబాబన్‌ను అదుపులోకి తీసుకున్నారు. Also Read: ఈ క్రమంలో గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం బాలిక మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. క్లూస్‌టీంతో కలిసి ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు అది జనని రాణాదిగా గుర్తించారు. దీనిపై సొబాబన్‌ను విచారించడంతో తానే చెల్లెలిని బలిచ్చినట్లు అంగీకరించాడు. నిందితుడు గతేడాది ఓ బాలుడిని బలిచ్చిన ఘటనలో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయినా బుద్ధి మార్చుకోకుండా సొంత చెల్లెలినే క్షుద్రపూజల కోసం బలిచ్చాడు Also Read:


By January 07, 2020 at 01:00PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/odisha-man-killed-sister-over-practising-black-magic/articleshow/73134978.cms

No comments