Breaking News

శ్రీకాకుళం జిల్లాలోకి పాక్ ఉగ్రవాది చొరబాటు?.. జల్లెడ పడుతున్న పోలీసులు


సంక్రాంతి పండుగకు సిద్ధమవుతున్న వేళ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేగింది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్ఐ ఒకడు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలోకి చొరబడినట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు వర్తమానం అందినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీ చేపట్టారు. సరిహద్దులతో పాటు చెక్‌పోస్టుల వద్ద నిఘా ముమ్మరం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత వదిలిపెడుతున్నారు. కొత్తవ్యక్తులు, అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. Also Read: పండుగ వేళ అలజడులు సృష్టించాలన్న లక్ష్యంతో ఉగ్రవాదులు శ్రీకాకుళం జిల్లాను టార్గెట్ చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉగ్రవాది సముద్ర మార్గంలో వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అన్ని ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. అయితే ఇది నిఘా వర్గాల నుంచి కచ్చితంగా వచ్చిన సమాచారమా? లేక వదంతులా? అన్న దానిపై పోలీసులు స్పష్టత ఇవ్వడం లేదు. Also Read:


By January 13, 2020 at 11:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/isi-terrorist-entered-into-srikakulam-district-police-start-checkings/articleshow/73222915.cms

No comments