సినీనటి కళ్యాణి ఆత్మహత్య.. భర్తే చంపాడంటున్న తల్లిదండ్రులు
సినీ జూనియర్ ఆర్టిస్ట్ కళ్యాణి ఆత్మహత్యపై ఆమె కుటుంబ సభ్యులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బల్కంపేటలోని లింగయ్యనగర్‌లోని ఇంట్లో ఈ నెల 10న కళ్యాణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తన చేసుకుందని భర్త ప్రసాద్ ఫిర్యాదు చేయగా, పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఆర్టీఓ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. శనివారం రాత్రి ఈఎస్‌ఐ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పలువురు సినీ మూవీ, ఆర్టిస్ట్ యూనియన్ నాయకులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. Also Read: తాజాగా కళ్యాణిని హోంగార్డుగా పనిచేస్తున్న ఆమె భర్త ప్రసాదే హత్య చేసి చంపేశాడంటూ ఆదివారం ఆమె కుటుంబసభ్యులు ఆరోపించారు. మృతురాలి తల్లి సూరినేనమ్మ తెలంగాణ సినీ,ఆర్టిస్ట్ యూనియన్ నాయకులతో కలిసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కుల్లా గ్రామానికి చెందిన కళ్యాణి మొదటి భర్తతో విడాకులు తీసుకుని కుమార్తెతో కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ.. పలు ఈవెంట్లు కూడా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హోంగార్డుగా పనిచేసే ప్రసాద్‌తో పరిచయం ఏర్పడి పెళ్లి చేసుకుంది. Also Read: అయితే వారు 8 నెలల క్రితం వారు వివాహం చేసుకున్నట్లు స్నేహితులు చెబుతుండగా రెండేళ్ల క్రితమే వివాహం చేసుకున్నట్లు ప్రసాద్ చెబుతుండటంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణి మృతదేహానికి గుట్టుచప్పుడు కాకుండా సవతి తల్లి సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆమె తల్లి సూరినేనమ్మ చెబుతోంది. ఆస్తి కోసమే భర్తే కళ్యాణిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read: కళ్యాణి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ తల్లి ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఆర్‌నగర్ ఇన్స్‌పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. కళ్యాణి కుమార్తె తాను తండ్రి వద్ద ఉండనని చెప్పడంతో నింబోలి అడ్డలోని ప్రభుత్వ వసతి గృహానికి తరలించారు. కళ్యాణి తన కూతురని సావిత్రి అనే మహిళ మొదట ఫిర్యాదు చేసిందని, తాజాగా సూరినేనమ్మ అనే మహిళ వచ్చి తానే అసలైన తల్లినంటూ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వస్తేనే ఆమె మృతికి గల కారణాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. Also Read:
By January 13, 2020 at 09:13AM
No comments