పొలానికి వెళ్లిన మహిళను చంపి తినేసిన పులి

చంద్రపూర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తులానా బీట్‌లో శుక్రవారం రాత్రి ఓ మహిళపై దాడి చేసిన ఆమె శరీరాన్ని సగం తినేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బ్రహ్మపురికి 12 కిలోమీటర్ల దూరంలోని తులానా మెండా గ్రామానికి చెందిన వర్ష జిబ్‌కాటే(42) అనే మహిళ శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లింది. Also read: చీకటి పడినా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అటవీశాఖ అధికారుల సాయంతో వ్యవసాయ భూమి పరిసరాలలో గాలించారు. పొలానికి కొద్ది దూరంలో ఆమె మృతదేహం కనిపించడంతో అంతా షాకయ్యారు. Also read: సంఘటనా స్థలంలో పరిస్థితిని బట్టి ఆమెను పులి చంపిందని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. ఆమె కాలిని, శరీరంలోని కొంత భాగాన్ని పులి తినేసినట్లు గుర్తించారు. దీంతో అటవీశాఖ అధికారులు మృతదేహాన్ని తాలూకా ప్రభుత్వాసుపత్రికి పంపించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రజలు పట్టపగలు వ్యవసాయ పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. Also read:
By January 26, 2020 at 09:46AM
No comments