Breaking News

మహిళా వీఆర్ఏ‌ను కౌగలించుకున్న తహసీల్దార్.. కోరిక తీర్చాలంటూ వేధింపులు


మహిళా వీఆర్‌ఏపై మండల మేజిస్ట్రేట్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో చర్చనీయాంశమైంది. కురిచేడు మండలంలోని పడమర వీరాయపాలేనికి చెందిన మహిళా వీఆర్‌ఏ... స్థానిక తహసీల్దార్‌ డీవీబి వరకుమార్‌ తనను లైగింక వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. వీఆర్‌ఏ ఈ నెల 25న క్రిస్‌మస్ సందర్భంగా కురిచేడు తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిని తన ఇంటికి విందుకు ఆహ్వానించింది. అయితే సిబ్బంది అంతా వచ్చిన తహసీల్దార్‌ వరకుమార్‌ మాత్రం హాజరు కాలేదు. Also Read: క్రిస్‌మస్ విందుకు తాను హాజరు కాలేదు కాబట్టి తనకు ప్రత్యేకంగా విందు తహసీల్దార్ ఆమెను కోరాడు. కోడి కూరతో పాటు నువ్వూ కూడా కావాలంటూ ఆమెతో అసభ్యకరంగా మాట్లాడాడు. మీరు నా తండ్రిలాంటి వారు.. అలా మాట్లాడటం సరికాదని ఆమె వారించినా పట్టించుకోకుండా వెనుక నుంచి కౌగలించుకుని అసభ్యంగా తాకాడు. దీంతో బాధితురాలు సోమవారం ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. Also Read: దర్శి డీఎస్పీ ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో తహసీల్దార్‌ వరకుమార్‌ను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. తాను మహిళా వీఆర్ఏపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని, ఆమె తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని నిందితుడు చెబుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి నిజాలను నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. Also Read:


By January 07, 2020 at 10:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tahsildar-molested-woman-vra-in-prakasam-district-case-booked/articleshow/73132656.cms

No comments