గుంటూరులో కీచక తండ్రి.. కన్నకూతురిపైనే లైంగిక దాడి, గర్భం రావడంతో

మైనర్ కుమార్తెను లైంగికంగా లోబచుకుని గర్భవతిని చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన కీచక తండ్రిని పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న కామాంధుడిని సోమవారం అరెస్టు చేశారు. పెండింగ్ కేసుల సమీక్ష చేస్తున్న సమయంలో నిందితుడు తప్పించుకు తిరగడాన్ని సీరియస్‌గా తీసుకున్న అర్బన్ ఎస్పీ రామకృష్ణ... ఈస్ట్ డీఎస్పీ కె.సుప్రజ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని నియమించారు. దీంతో ఈ టీమ్ కీచకుడు కదలికలపై నిఘా పెట్టి చాకచక్యంగా పట్టుకుంది. Also Read: గుంటూరు నల్లచెరువు 19వ లైనులో నివసించే మహంకాళి నాగరాజుకు ఇద్దరు కుమార్తెలు. 2016 ఆగస్టు 8న మైనారిటీ తీరకుండానే రెండో కుమార్తెకు వివాహం చేశాడు. వివాహమైన కొంతకాలానికి అల్లుడు, కూతురు నాగరాజు ఇంటికే వచ్చి కాపురం పెట్టారు. కీచక మనస్తత్వం ఉన్న నాగరాజు కుమార్తెపై కన్నేశాడు. అల్లుడు, భార్య కూలి పనులకు వెళ్లినప్పుడు ఏవో సాకులు చెబుతూ కూతురిని ఇంటి వద్దే ఉండేలా చేసి బెదిరించి లైంగిక దాడికి పాల్పడేవాడు. భర్తతో కాపురం చేయొద్దంటూ ఆమెను బెదిరించేవాడు. కొంతకాలానికి ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించాడు. Also Read: తండ్రి లైంగిక దాడి, వేధింపులు భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక 2017, మార్చి 22వ తేదీన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నాగరాజుపై అనుమానం వ్యక్తం చేసిన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యా్ప్తు చేపట్టారు. దీంతో నాగరాజు ఇంటి నుంచి పరారయ్యాడు. నాగరాజు అఘాయిత్యం వల్లే ఆమె గర్భం దాల్చినట్లు డీఎన్ఏ పరీక్షలో తేలడంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఇటీవల అర్బన్ ఎస్పీ రామకృష్ణ నేరాల పునః సమీక్ష సమయంలో ఈ కేసుపై ఆరా తీసి నిందితుడిని పట్టుకోవాల్సిందిగా ఆదేశించారు. దీంతో నాగరాజుపై నిఘా పెట్టిన పోలీసులు అతడు ప్రస్తుతం గుంటూరు సమీపంలోని ఓ గ్రామంలో ఉంటున్నాడని తెలిసి సోమవారం అరెస్టు చేశారు. Also Read:
By January 07, 2020 at 10:43AM
No comments