‘అల వైకుంఠపురములో’ అరుదైన రికార్డ్: హాలీవుడ్ సినిమాలు వెనకబడ్డాయ్!

భారతీయ చిత్రపరిశ్రమ ఈసారి అమెరికా బాక్సాఫీస్ వద్ద జయకేతనం ఎగరవేసింది. ఈ వారంలో విడుదలైన సినిమాల్లో టాప్ పది చిత్రాల తొలి వారం వసూళ్లను అమెరికన్ మీడియా అండ్ ఎనలిటిక్స్ కంపెనీ కామ్ స్కోర్ విడుదల చేసింది. ఆ పది సినిమాల్లో ఐదు భారతీయ సినిమాలు ఉండటం విశేషం. అంతేకాదు ఆ ఐదు సినిమాల్లో మూడు దక్షిణాది సినిమాలే ఉన్నాయి. మరో విషయం ఏంటంటే.. టాప్ పది జాబితాలో హాలీవుడ్ సినిమాలను సైతం వెనక్కి నెట్టి ‘’ అగ్రస్థానంలో నిలిచింది. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ నాలుగో స్థానంలో నిలవగా.. సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన ‘దర్బార్’ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ఇది భారతీయ చిత్రపరిశ్రమకు దక్కిన అరుదైన గౌరవం అని సినీ విశ్లేషకులు రమేష్ బాలా హర్షం వ్యక్తం చేశారు. మున్ముందు భారతీయ చిత్రపరిశ్రమ ఇలాంటి రికార్డులు మరెన్నో సాధించాలని కోరుతున్నట్లు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసిన సినీ నటి పూజా హెగ్డే ‘వావ్’ అని సమాధానం ఇచ్చారు. కామ్ స్కోర్ విడుదల చేసిన టాప్ పది సినిమాలు ఇవే. READ ALSO: * అల వైకుంఠపురములో * ఆఫ్టర్‌వర్డ్ * మిసరబుల్స్ * సరిలేరు నీకెవ్వరు * దర్బార్ * తానాజీ * వుమెన్ హూ లవ్స్ జిరాఫీస్ * బ్రానాగ్ థియేటర్ లైవ్ * అడోరింగ్ * చపాక్ READ ALSO:
By January 14, 2020 at 09:31AM
No comments